చత్తీస్‌ఘడ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది దుర్మరణంపాలయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలోని కతియా గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులంతా సమాధిన్ మీటింగ్ కార్యక్రమానికి తిరయ్య గ్రామం నుంచి వ్యాన్‌లో తిరిగి వస్తుండగా..
కతియా గ్రామం వద్ద రోడ్డుపై ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందగా.. 23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు వ్యాన్‌లో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులంతా పత్ర గ్రామ వాసులుగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బెమెతర జిల్లా ఆసుపత్రి, సిమ్గా ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.