Friday, December 6, 2024

Delhi | దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు.. కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దాంతోపాటు 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

- Advertisement -

ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను..

అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్ లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు..

తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement