Tuesday, November 26, 2024

ఏపీలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 84 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు అవుతున్నా.. 15 వేల చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాదు రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 60,124 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14, 986 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహ్మమారితో 84 మంది మృతి చెందారు.  అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2352, విశాఖలో 1618, చిత్తూరులో 1543, గుంటూరులో 1575, కడపలో 1224 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇదే సమంయలో 16,167 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కోవిడ్ తో పశ్చిమగోదావరి, గుంటూరుల్లో జిల్లాల్లో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, విశాఖలో 9, నెల్లూరు, విజయనగరం జిల్లాలో 8 మంది, చిత్తూరు, కర్నూలులో ఆరుగురు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు.   ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,74,28,059 మంది సాంపిల్స్ ని పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇది చదవండి: ఏయ్ సజ్జల.. ఎవడ్రా నువ్వు?: నిప్పులు చెరిగిన రఘురామ

Advertisement

తాజా వార్తలు

Advertisement