పంజాబ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న తుపాకీ సంస్కృతి పై భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రాష్ట్రంలోని 813 తుపాకుల లైసెన్సులు రద్దు చేసింది. లుథియానా రూరల్‌లో 83 తుపాకుల లైసెన్సులు రద్దు చేయగా, సహద్ భగత్‌సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్‌కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హూషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్‌ఏఎస్ కస్బా నుంచి 235, సంగ్రూర్ నుంచి 16 తుపాకుల లైసెన్సులను రద్దు చేశారు. అమత్‌సర్ కమిషనరేట్‌లోని 28 మంది, జలంధర్ కమిషనరేట్, ఇతర జిల్లాల నుంచి 11 మంది లైసెన్సులు రద్దయ్యాయి. పంజాబ్ ప్రభుత్వం ఇంతవరకూ 2,000కు పైగా ఆయుధాల లెసెన్సులను రద్దు చేసింది.
తుపాకుల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి తుపాకులు తీసుకు వెళ్లడం, ప్రదర్శించడంపై ప్రస్తుతం నిషేధం ఉందని, రాబోయే రోజుల్లో విస్తృతంగా తుపాకుల తనిఖీలు ఉంటాయని తెలిపింది. తుపాకీ సంస్కృతిని తుదముట్టించేందుకు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. పంజాబ్‌లో 3,73,053 ఆయుధాలకు లైసెన్సులు ఉన్నాయి. 28 ఏళ్ల పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలాను గత ఏడాది పట్టపగలే దుండగులు కాల్చిచంపిన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది.