Saturday, November 23, 2024

తెలంగాణలో 80 శాతం మందికి ఫస్ట్ డోస్

తెలంగాణలో కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ఇప్పటివరకు 1.74 కోట్ల మంది వ్యాక్సిన్ లు వేసుకున్నార‌ని ఆరోగ్య‌శాఖ ప్ర‌కటించింది. మొత్తం 2.20 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాల‌ని ప్రభుత్వం నిర్దేశించ‌గా.. దాదాపు 80 శాతం మందికి వ్యాక్సిన్ లు ఇవ్వ‌డం పూర్త‌య్యింద‌ని ప్ర‌క‌టించింది. అంటే 80 శాతం మంది ఫస్ట్ డోస్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే పలుచోట్ల కరోనా వ్యాక్సిన్ కొరత వల్ల కొంతమంది సెకండ్ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ప్ర‌పంచ దేశాల‌తో పోలీస్తే వ్యాక్సిన్ విష‌యంతో భార‌త్ వెన‌క‌బ‌డి ఉంది. మ‌న దేశంలో ఏదో ఒక వ్యాక్సిన్ ఫ‌స్ట్ డోస్ తీసుకున్న వారు 33.6 శాతం ఉన్నారు. 217 దేశాల డేటాతో పోల్చితే వ్యాక్సినేషన్ విషయంలో భార‌త్ 110వ స్థానంలో నిలిచింది. యూఏఈ అత్య‌ధికంగా 84.9శాతం వ్యాక్సినేష‌న్ చేసి అగ్ర‌స్థానంలో ఉంది.

ఈ వార్త కూడా చదవండి: థర్డ్ వేవ్ వచ్చేసినట్లేనా..? ఇండియాలో మరోసారి 45,083 కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement