Saturday, November 23, 2024

నగదు చలామణిలో 8శాతం వృద్ధి: కేంద్రం

2022 డిసెంబర్‌ 2 నాటికి నగదు చలామణిలో వార్షిక వృద్ధి 7.98 శాతంగా నమోదైంది. ఈ విలువ రూ.31.92 లక్షల కోట్లుగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్థిక వృద్ధి, వడ్డీరేట్లు సహా అనేక స్థూల ఆర్థిక అంశాలపై కరెన్సీ చలామణి వృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో నోట్ల పరిమాణం దాని డిమాండ్‌పై ఆధారపడివుంటుంది.

ఇది జీడీపీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, చిరిగిన నోట్లను మార్చడం, నగదు రహిత చెల్లింపు పద్ధతుల్లో మార్పులు కూడా కారణం అవుతుంటాయి. నల్లధన వ్యాప్తిని నిర్మూలించడం తోపాటు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం కోసం నగదు రహిత ఆర్థిక వ్యవస్థవైపు వెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని నిర్మల స్పష్టంచేశారు. ఈ దిశగా ప్రభుత్వంతోపాటు, ఆర్‌బీఐ కూడా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement