పంజాబ్: బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను రెయిలింగ్ను ఢీకొట్టిన బస్సు.. కాల్వలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. జీవన్ సింగ్ వాలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.
క్షతగాత్రులు షహీద్ భాయ్ మణి సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు సర్దుల్గఢ్ నుండి బఠాండాకు వెళ్తుండగా జీవన్ సింగ్ వాలా దగ్గర కాలువలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -