ఈ సంవత్సరం ఆగస్టు నెలలో దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాప్ టెన్‌లో 8 కార్లు మారుతీ సుజుకి కంపెనీకి చెందినవే ఉన్నాయి. మారుతీ సుజుకీ టాప్‌గేర్‌కు ప్రధానంగా బాలినో, బ్రిజా, ఫ్రాంక్స్ అమ్మకాలు దోహదం చేశాయి. టాప్‌టెన్ అమ్మకాల్లో మొదటి స్థానంలో స్విఫ్ట్ నించింది. 2022 ఆగస్టులో ఇది 10వ స్థానంలో ఉంది. బాలినో కార్ల అమ్మకాలు రెండో స్థానంలో ఉన్నాయి. మారుతీ సుజుకీ జూన్‌లో మార్కెట్లోకి తీసుకు వచ్చిన జిమ్మీ అమ్మకాల్లో ఇంకా టాప్ టెన్ జాబితాలో చేరలేకపోయింది. అమ్మకాల్లో మూడో స్థానంలో వెగనార్ నిలిచింది.
జులై కంటే ఆగస్టులో ఈ మోడల్ అమ్మకాలు 20 శాతం పెరిగాయి. జూన్‌లో వెగనార్ అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన స్విఫ్ట్ ఆగస్టు నెలలో 18,653 యూనిట్లుగా ఉంది. 18,516 యూనిట్ల అమ్మకాలతోఓ బాలినో రెండో స్థానంలో ఉంది. వెగనార్ 15,578 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో, 14,572 యూనిట్లతో నాలుగో స్థానంలో బ్రిజా నిలిచాయి. టాటా మోటార్స్‌కు చెందిన పంచ్ 14,523 యూనిట్ల అమ్మకాలతో 5వ స్థానంలో ఉంది.
హ్యాండాయ్ కంపెనీకి చెందిన క్రెటా మోడల్ కారు 13,823 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో 13,293 యూనిట్ల అమ్మకాలతో డిజైర్ ఉంది. మారుతీ సుజుకీ ఎర్టిగా 12,315 యూనిట్లతో 8వ స్థానంలో ఉంది. ఇదే కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ 12,164 యూనిట్లతో 9వ స్థానంలో, మారుతీ సుజుకీ ఇకో మోడల్ 11,859 యూనిట్లతో 10 స్థానంలో నిలిచింది. ఆగస్టు నెలలో టాప్‌టెన్ జాబితాలో టాప్ 5లో రెండు ఎస్యూవీ వాహనాలు ఉన్నాయి.
ఎస్‌యూవీల పట్ల వాహనదారుల్లో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గత నెలతో పోల్చితే అమ్మకాలు 12 శాతం తగ్గినప్పటికీ మారుతీ సుజుకీ ఎస్యూవీ విటారా బ్రిజా 4వ స్థానంలో ఉంది. టాటా మోటార్స్‌కు చెందిన ఎస్యూవీ మోడల్ పంచ్ అమ్మకాలు 21 శాతం పెరిగి 14,523 యూనిట్లతో ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. టాప్ టెన్ ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 40 శాతంగా ఉంది.
2020 ఆర్ధిక సంవత్సరం వరకు వరసగా 16 సంవత్సరాల పాటు అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ ఆల్టో క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతున్నది. మారుతీ సుజుకీ ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తీసుకు వచ్చిన గ్రాండ్ విటారా మోడల్ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. టాప్ 10లో ఉన్న ఈకో మోడల్ కంటే 41 యూనిట్లు వెనుకబడింది. జులైలో పోల్చితే ఆగస్టులో గ్రాండ్ విటారా అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగాయి.