Saturday, November 23, 2024

జర్మనీలో పనిచేసేందుకు 78 మంది నర్సులు ఎంపిక

అమరావతి, ఆంధ్రప్రభ: జర్మనీలో నర్సింగ్‌ వృత్తిలో పనిచేసేందుకు రాష్ట్రం నుంచి 78 మంది నర్సులకు మార్గం సుగమమైంది. బీ1 స్థాయి జర్మన్‌ భాషా శిక్షణను విజయవంతంగా పూరి ్త చేసిన వీరు జర్మనీకి చేరుకున్న తర్వాత, బీ 2 నైపుణ్యం కోసం 6 నెలల భాషా శిక్షణ పొందనున్నారు. ఆ తరువాత వారికి వారికి జర్మనీలోని వివిధ ఆసుపత్రులలో ప్లేస్‌మెంట్‌ ఇవ్వబడుతోందని ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నర్సుల కోసం జర్మన్‌ భాషా శిక్షణా కార్యక్రమాన్ని జూలై నెలలో చేపట్టామన్నారు.

ఓవర్సీస్‌ మ్యాన్‌పవన్‌ కంపెనీ(ఏపీ) టెక్టె ఇంటర్నేషనల్‌ (యుకె) జర్మనీకి చెందిన ఆక్సిలా అకాడమీ మొత్తం 150 మందికి నర్సుల దరఖాస్తుల్ని పరిశీలించి వారిలో 78 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. జర్మనీ వంటి దేశం కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ పొందిన మొదటి బ్యాచ్‌ ను తయారు చేసినట్లు చెప్పారు. జర్మనీ భాషా శిక్షణా కార్యక్రమాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఉన్నత వృత్తి ప్రమాణాలతో పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు దక్కిందని వినోద్‌ కుమార్‌ తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒక శక్తివంతమైన నైపుణ్య ప ర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు. విదేశీ ప్లేస్‌మెంట్స్‌ కోసం అంతర్జాతీయ ఏజెన్సీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement