తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 755 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం భర్తీ చేసే పోస్టుల్లో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ద్వారా పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
- Advertisement -