Friday, November 22, 2024

ట‌ర్కీ,సిరియాలో భూకంప విల‌యం – 72వేల మందికి పైగా దుర్మ‌ర‌ణం

ఇస్తాంబుల్‌: టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. తాజా సమా చారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్ల డించాయి. అయితే ఈ భూ ప్రళయంలో దాదాపు 72వేల మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ సంస్థలు నివేదిస్తున్నాయి. ఏడు లక్షల కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లిన ట్లు అంచనాలు వెల్లడవుతున్నాయి. ఆత్మీయులను కోల్పోయి న విషాదం ఒకవైపు, తినడానికి తిండి, ఉండటానికి గూడు లేనిస్థితి మరొకవైపు అక్కడి పౌరులను నిస్సహాయులను చేశాయి. శిథిలాల కింద చిక్కుకున్న కుటుంబ సభ్యుల కోసం బంధువుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.ఒక్క టర్కీలోనే 32,000 మంది మరణించగా.. సిరియాలో 5,714 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమ య్యాయి. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకుని సాయం కోసం వేచి చూస్తున్నారు. గడ్డకట్టే చలిలోనూ సహా యక బృందాలు నిరంతరం శ్రమిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది ప్రజల్ని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, భూకంపం సంభవించి వారం రోజులు పూర్తవడంతో శిథిలా ల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు స్నిఫర్‌ డాగ్స్‌, థర్మల్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు.

తెర‌చుకున్న స‌రిహ‌ద్దులు
సిరియాలో విధ్వంసం సృష్టించిన భూకంపాల కార ణంగా రెండు సరిహద్దులు తెరుచుకున్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత టర్కీతో ఉన్న సరిహద్దులను సిరియా ప్రభుత్వం తెరిచింది. ఐక్యరాజ్య సమితి సూచనల మేర కు రెండు సరిహద్దులను తెరవాలని సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ ఆస్సాద్‌ ప్రకటించగానే అధికారులు వేగంగా స్పందించి క్రాసింగ్స్‌ ప్రారంభించారు. ఈ సరిహద్దుల గుండా ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు సిరియా లోకి వచ్చేందుకు వీలుచిక్కింది. 2011 లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం తర్వాత ఈ సరిహద్దులను మూసి ఉంచారు. వాయవ్య సిరియాలో బాధిత ప్రజల ను ఆదుకోవడంలో ప్రపంచం మొత్తం విఫలమైందని ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నది. ఐరాస ప్రకా రం, సిరియాలో 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement