Tuesday, November 26, 2024

Swiggy | 6 నెల్లో 72 లక్షల బిర్యానీలు.. స్విగ్గీలో వచ్చిన ఆన్‌లైన్‌ ఆర్డర్లు

ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్‌ వాసులు ఆన్‌లైన్‌లో 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు ఇచ్చారు. ప్రపంచ బిర్యానీ డే సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్‌ స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతి 5 ఆర్డర్లలో ఒకటి హైదరాబాదీ బిర్యానీ ఉంటుందని తెలిపింది. ఒక సంవత్సరంలో బిర్యానీ ఆర్డర్లు 150 లక్షలకు పైగా వచ్చినట్లు తెలిపింది. ఈ సంవత్సరం మొదటి ఐదున్నర నెలల కాలంలో హైదరాబాద్‌లో బిర్యానీ ఆర్డర్లు 8.39 శాతం పెరిగాయి. ధమ్‌ బిర్యానీ ఆర్డర్లు 9 లక్షలకు పైగా ఉన్నాయి.

బిర్యానీ రైస్‌ ఆర్డర్లు 7.9 లక్షలగా ఉన్నాయని పేర్కొంది. మినీ బిర్యానీ ఆర్డర్లు 5.2 లక్షలుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 15వేలకు పైగా రెస్టారెంట్లు హైదరాబాదీ బిర్యానీని ఆఫర్‌ చేస్తున్నాయని తెలిపింది. ప్రధానంగా కూకట్‌పల్లి, మాధాపూర్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, కొత్తపేట, దిల్‌షుక్‌నగర్‌ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు ఎక్కువగా బిర్యానీ ఆఫర్‌ చేస్తున్నాయి. ఇందులో బిర్యానీ కోసం ఎక్కువగా ఆర్డర్లు వచ్చిన ప్రాంతాల్లో కూకట్‌పల్లి అగ్రస్థానంలోఉంది. దీని తరువాత మాధాపూర్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాలు ఉన్నాయని స్విగ్గీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement