Tuesday, November 19, 2024

14 రాష్ట్రాలకు 7,183 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద మంజూరు

కేంద్ర ప్రభుతం రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, అసోం, కేరళతో పాటు మొత్తం 14 రాష్ట్రాలు రెవెన్యూ లోటు గ్రాంట్‌ను అందుకోనున్నాయి. వ్యయ మంత్రిత శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ డబ్బును విడుదల చేసింది. ఇది రాష్ట్రాలకు డెవల్యూషన్‌ అనంతరం నెలవారీ రెండో రెవెన్యూ గ్రాండ్‌ నిధి. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఈ గ్రాంట్‌ను విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను.. రెవెన్యూ లోటు గ్రాంట్‌ను ఏపీ, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌ అందుకోనున్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 14 రాష్ట్రాలకు దశల వారీగా రూ.86,201 కోట్లు అందజేయాల్సిందిగా 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. సిఫార్సుల మేరకు 12 సమానమైన నెలవారీ వాయిదాల్లో గ్రాంట్‌ను అందజేయడం జరుగుతుంది. ఈ విడుదలతో 2022-23లో రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ లోటు గ్రాంట్ల మొత్తం రూ.14,366.84 కోట్లకు చేరుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement