Friday, November 22, 2024

71 లక్షల పీఎఫ్​ ఖాతాలకు గండి కొట్టిన కరోనా..

కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టాల్లోకి ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు భారీగా మూతపడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి లోక్ సభలో స్వయంగా వెల్లడించారు. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం ఎక్కువ ఖాతాలు క్లోజ్ అయ్యాయి. రిటైర్మెంట్, ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగం మారడం వంటి కారణాలతో 2019–2020లో 66.7 లక్షల ఖాతాలు క్లోజ్ అయితే.. 2020–2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లోనే అది 71 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 కోట్ల పీఎఫ్ ఖాతాలున్నాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం, నిరుద్యోగిత రేటు పెరగడం వంటి కారణాలతో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణలూ పెరిగాయి. 2019తో పోలిస్తే 2020లో రెట్టింపయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement