Wednesday, November 20, 2024

ఏడేళ్ల‌లో 705 కాలేజీల మూత!

ప్ర‌భ‌న్యూస్ : ఒకవైపు కళాశాలల నిర్వహణ భారం.. మరోవైపు కోట్లల్లో పేరుకు పోతున్న ఫీజు బకాయిలు… దానికి తోడూ కరోనా ప్రభావం.. వెరసి కళాశాలలకు శాశ్వతంగా తాళాలు పడుతున్న పరిస్థితి. ఏళ్లుగా నడిచిన కాలేజీలు సైతం నిర్వహణ భారంతో మూత పడుతున్నాయి. 2014-15లో రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సులు కల్గిన కళాశాలలు సుమారు 1703 వరకు ఉంటే, 2020-21లో అవి కాస్తా 998కి పడిపోయాయి. అంటే ఈ ఏడేళ్లలో మొత్తం 705 కాలేజీలు మూతపడినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు పేరుకు పోవడంతో జీతాలు, కళాశాల నిర్వహణ భారం తదితర సమస్యల్లో కాలేజీ యాజమాన్యాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

పైగా అన్ని కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించిన సీట్లన్నీ నిండడంలేదు. చాలా కాలేజీల్లో సుమారు 20 శాతం నుంచి 50 శాతం వరకు సీట్లు మిగిలి పోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాణ్యమైన విద్యా ప్రమాణాలను కళాశాలలు పాటిస్తున్నాయా? లేదా? అనే పర్యవేక్షణ లేకుండానే ఇబ్బడి ముబ్బడిగా కళాశా లలకు అను మతులి చ్చేశారు. దాంతో విద్యా ప్రమాణాలు కలిగిన మంచి కాలేజీల్లోనే విద్యార్థులు అడ్మిష న్లు పొందేందుకు ఆసక్తి కనబరు స్తుండడంతో కొన్ని కాలేజీల్లోనే సీట్లన్నీ ఫుల్‌గా నిండుతుంటే, మరికొన్ని కాలేజీల్లో మాత్రం సగం సీట్లే నిండు తున్నాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో కరోనా ప్రభా వం విద్యారంగంపై పడుతుం డడం తో ప్రైవేట్‌ విద్యా సంస్థలు కుదేలయ్యే పరిస్థితికి క్రమంగా చేరుకుం టున్నా యి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement