మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌రా ష్ట్రాల్లో భాజపా విజయంపై కొందరు కాంగ్రెస్ అనుకూలురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వీటికి భాజపా నేతలు గట్టిగా బదులిస్తున్నారు. తాజాగా దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. హస్తం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
తమ అహంకారం, అబద్ధాలు, నిరాశావాదం, అజ్ఞానంతో వారు బహుశా ఆనందంగానే ఉండి ఉంటారు. కానీ, వారి విభజన సిద్ధాంతంతో మనం జాగ్రత్తగా ఉండాలి. అది 70 ఏళ్లుగా వారికి అలవాటైన పద్ధతి. అంత సులువుగా వదిలిపెట్టలేరు” అని మోదీ ప్రజలను హెచ్చరించారు. కానీ, ఇప్పుడు ప్రజలు మరింత విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని, అందువల్ల మున్ముందు మరిన్ని ఘోర పరాభవాలకు వారు (కాంగ్రెస్) సిద్ధంగా ఉండాలని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ పోస్ట్‌కు ప్రధాని ‘హెచ్చరిక’ను సూచించే, నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. దీంతో మోదీ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.