మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్-1 సారథి అయిన 40 ఏళ్ల హిడ్మాను పట్టిస్తే రూ.7లక్షల రివార్డును అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే రూ. 40 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల్లో భారీ దాడులకు వ్యూహాలను రచించడం హిడ్మా స్పెషలిస్టు అని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నంబర్ 1 బెటాలియన్ కమాండర్ గా, దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు హిడ్మా.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దులో ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో భద్రతా దళాలకు చెందిన 22 మంది మృతిచెందారు. ఈ దాడికి వ్యూహ రచన చేసింది హిడ్మానేనని పోలీసులు నిర్ధారించారు. ఇటీవల ఎన్‌ఐఏ బృందం ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌కౌంటర్ సంభవించిన ప్రాంతంలో పర్యటించిన తర్వాత హిడ్మాపై రివార్డును ప్రకటించారు.