ఉక్రెయిన్‌కు అత్యాధునిక 7 స్వయంచోదిత హోవిడ్జర్ ఫిరంగులను అందించనున్నట్లు జర్మనీ రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది. దీనికి తోడుగా ఐదు డచ్ తయారీ హోవిడ్జర్‌లను కూడా అందించనున్నారు. మరోవైపు జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఆదివారంవర్చువల్‌గా భేటీ కానున్నారు. కీవ్‌పై దాడి జరిగిన తరువాత సహాయం అందిస్తున్నప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో దేశవిదేశ ప్రతినిధులు పర్యటిస్తుండగా అక్కడికి వెళ్లేందుకు షోల్జ్ ఆసక్తి చూపలేదు. దీంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిస్తితుల్లో జెలెన్ స్కీ తో భేటీకి రంగం సిద్దమైంది. ఆదివారంనాడు నిర్వహించనున్న జీ-7 గ్రూప్ సమావేశానికి జెలెన్ స్కీని ఆహ్వానించిన నేపథ్యంలో వీరిద్దరు మాట్లాడుకుంటారని జర్మనీ అధికార ప్రతినిధి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..