Friday, November 22, 2024

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధ ప్రభావంతో పేదరికంలోకి 7కోట్ల మంది.. వెల్లడించిన ఐరాస

రష్యా, ఉక్రెయిన్ల యద్ధం దేశవ్యాప్తంగా సుమారు 7కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలని దారిద్య్రరేఖ కిందకు నెట్టేసిందని ఐఖ్యరాజ్య సమితి అధికారులు గురువారం విడుదల చేసిన అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన నివేదికలో తెలిపారు. యుద్ధానంతరం కొన్ని వారాల్లో పెరిగిన ఆహారపు కొరత, ఇంధన ధరల పెంపు ఫలితంగా ప్రజానికం దుష్పరిణామాలెదుర్కున్నట్లు వారు స్పష్టం చేశారు. యుద్ధం జరిగిన తరువాత మొదటి మూడు నెలలలోనే సుమారు ఐదు కోట్లమంది సామాన్య ప్రజలు కరువు బారిన పడ్డారని అంచనాకి వచ్చారు. రోజుకి ఒక డాలర్‌ కంటే తక్కువ ఆదాయం గడించి అతి కష్టం మీద బ్రతుకునీడ్చుకునే స్థితికి వారు చేరుకున్నట్లు ఐరాస అధికారులు చెబుతున్నారు. తమ అంచనా ప్రకారం యుద్ధం వల్ల ప్రపంచ జనాభాలో 9 శాతం మంది ప్రజలు పేదరికంలో పడిపోయినట్లు పేర్కొన్నారు. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు రోజుకు మూడు డాలర్ల కంటే తక్కువ సంపాదించే స్థితికి చేరుకుని దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ ఆదాయం వచ్చే దేశాలలో, ప్రజలు తమ ఆదాయంలో 42 శాతం తమ ఆహారం కోసమే ఖర్చుచేస్తారు. కానీ పాశ్చాత్య దేశాలు రష్యాకి అండగా నిలవడంతో, గోధుమలు, చక్కెర, నూనె తదితర సరుకులతో పాటు ఇంధనం ధరలు కూడా భారీగా పెరిగాయి. కాగా ఉక్రెయిన్‌ లోని ఓడరేవులో ఎగుమతి దిగుమతులను నిరోధించటమే కాకుండా, ఇతర చిన్న దేశాలకు పలు రకాలైన ధాన్యాలను ఎగుమతి చేసే పరిస్థితి సన్నగిల్లిన కారణంగా వాటి ధరలు అమాంతం పెరిగాయి.

తద్వారా హతీ, అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇరాక్‌, టర్కీ, ఫిలిప్పీన్స్‌, సూడాన్‌, కెన్యా, శ్రీలంక ఉజ్బెకిస్తాన్‌ వంటి కొన్ని దేశాలు ద్రవ్యోల్బణంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్నో చిన్న దేశాలలో సుమారు పది లక్షల మంది ప్రజలు కరువు బారిన పడినట్లు ఐఖ్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. మునుపెన్నడూ లేని విధంగా ఆదాయ వ్యయాలు, పెరిగిన ధరలూ ఒక తరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయని ఐఖ్యరాజ్య సమితి అభివృద్ధి నివేదిక ప్రారంభించిన సందర్భంగా., యు.ఎన్‌.డి.పి అడ్మినిస్ట్రేటర్‌ అకిమ్‌ స్టైనర్‌ అన్నారు. ఫిబ్రవరి చివరలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన మూడు నెలల్లోనే కోట్లమంది ఎదుర్కున్న పేదరికంతో పోలిస్తే, కోవిడ్‌ 19 లాక్‌డౌన్‌ సమయంలో పన్నెండు కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు 18 నెలల్లో నిత్యావసర సరుకులు దొరకక ఎంతో పేదరికాన్ని అనుభవించారని ఆయన పేర్కొన్నారు. పేదరికంతో సతమతమయ్యే దేశాలని ఆదుకోవడానికి ప్రపంచంలో తగినంత సంపద ఉందనీ., కానీ దేశాలకు సేవ చేసే యోగ్యత, ఆలోచన, ఐకమత్యం ప్రతి దేశంలో ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆప్గnనిస్థాన్‌, ఇతోపియా, మాలి, నైజీరియా వంటి దేశాలలో అప్పటికే పేదరికంలో అత్యల్పంగా బ్రతుకుతున్న ప్రజలే అధికంగా ఉండడం వల్ల ఆయా దేశాలలో ద్రవ్యోల్భణం మరింత తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. దారిద్య్ర రేఖకంటే దిగువన కాకుండా ఆదాయం వచ్చే వారూ, సరాసరి మధ్యస్థంగా సంపాదించే వారి సంఖ్య సుమారు ప్రపంచ జనాభాలో 70 శాతం వరకూ ఉండడం గమనార్హం. బ్లాంకెట్‌ ఎనర్జీ సబ్సిడీల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే కంటే ప్రభుత్వాలు తమ పధకాలకు ఉంచిన నగదు ద్వారా ఎన్నో యుద్ధం వల్లా, కోవిడ్‌ వల్లా ప్రభావితమై పేదరికంలో మగ్గుతున్న ఎన్నో పేద దేశాల ప్రజల జీవనోపాదిని లక్ష్యంగా పెట్టుకుని ఖర్చు చేస్తే., ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది ప్రజలు రోజుకి 5 డాలర్లు సంపాదించే అవకాశం ఉందని., ఎంతో మందిని పేదరికంలో పడకుండా నివారించవచ్చని ఐఖ్యరాజ్య సమితి ( యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యు.ఎన్‌.డి.పి)) సిఫారసు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement