యూకేలో వింత ఘటన చోటు చేసుకుంది. 2018 మార్చిలో వీయూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన బర్మింగ్‌హామ్ స్టార్ సిటీలో 24 ఏళ్ల అతీక్ రఫీక్ సినిమా చూసేందుకు వెళ్లాడు. సీటులో కూర్చున్న తర్వాత.. మొబైల్, తాళం చేవి చేతులో నుంచి జారిపోయి సీటు కిందపడ్డాయి. దాన్ని వెతికేందుకు సీటు కింద తల పెట్టగా అది బిగుచుకుపోయింది. అతన్ని బయటకు తీసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతీక్ మెదడుకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు.
అయితే రఫీక్ భార్య అయేషా ఈ ఘటనను ఊరికే వదిలిపెట్టలేదు. థియేటర్‌లోని సీట్‌ని సరిగ్గా ఫిట్ చేయకపోవడం వల్లే తన భర్త మరణించాడని కోర్టును ఆశ్రయించింది. విచారణ తర్వాత బాధితురాలికి థియేటర్ యాజమాన్యం రూ. 7.67 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు సూచించింది. చూశారా.. ఒక్క సీటు ఎంత పని చేసిందో?
ఈ వార్త కూడా చదవండి: అభిమానుల బుర్రలు మారాలంటున్న హీరో సిద్ధార్థ్