Tuesday, November 26, 2024

Taiwan: తైవాన్‌లో భూకంపం…7.5తీవ్ర‌త‌తో ప్రకంప‌న‌లు…

తైవాన్‌లో ఇవాళ‌ భూక‌పం సంభ‌వించింది. తైపీలో 7.5తీవ్ర‌త‌తో భూమి కంపించింది. దీంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. బలమైన భూకంపం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎంత మందికి గాయాలయ్యాయి, ప్రాణ నష్టం ఏ మేరకు జరిగిందనే సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

అయితే, తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ ఈ భూకంప తీవ్రతను 7.2గా ప్రకటించగా, అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం 7.5గా పేర్కొంది.మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలలు మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఒకినావా, మియాకోజిమా, యాయామా ద్వీపం చుట్టుపక్కల నివాసితులు వెంటనే ఖాళీ చేయాలని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. సునామీ అలలు తీరాన్ని సమీపిస్తున్నాయని, వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement