Monday, November 18, 2024

డెల్‌లో 6,650 మంది ఉద్యోగులపై వేటు..

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుం జుకుంది. టెక్‌ కంపెనీలకు ఇప్పుడు కంప్యూటర్‌ తయారీ కంపెనీలు జతకట్టాయి. డిమాండ్‌ లేదన్న పేరుతో, వ్యయాలను నియంత్రించాలన్న పేరుతో వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. 2023లో కేవలం ఒక్క నెలలోనే దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. పర్సనల్‌ కంప్యూటర్ల(పీసీ)లకు డిమాండ్‌ తగ్గడంతో ఆదాయం తగ్గిందన్న పేరుతో ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్‌ టెక్నాలజీస్‌ 6,650 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో ఇది 5 శాతానికి సమానం. ఆర్ధిక పరిస్థితుల మూలంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ కో-చీప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్క్‌ తెలిపారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ప్రముఖ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐడీసీ తెలిపింది. డెల్‌ పర్సనల్‌ కంప్యూటర్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 37 శాతం వరకు పడిపోయాయి.

- Advertisement -

డెల్‌ ఆదాయంలో 55 శాతం పీసీల అమ్మకాల నుంచే వస్తోంది. డెల్‌ కంటే ముందే పీసీల తయారీ కంపెనీలు కొన్ని ఉద్యోగులను తొలగించాయి. హెచ్‌పీ గత నవంబర్‌లో 6000 మంది ఉద్యోగులను తొలగించింది. సిస్కో సిస్టమ్స్‌ 4000 మందికి ఉద్వాసన పలికింది.. 2022లో ఇప్పటి వరకు టెక్‌ రంగంలో 97,171 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ ఛాలెంజర్‌ తెలిపింది. గత సంవత్సరంతో పోల్చితే ఉద్యోగ కోతలు 649 శాతం పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement