Sunday, November 17, 2024

వాల్తేర్‌ డివిజన్‌లో 66.88 మెట్రిక్‌ టన్నుల సరకు లోడ్‌.. 8498.86 కోట్లు ఆదాయం

విశాఖ ఎడ్యుకేషన్‌, ప్రభన్యూస్‌ : వాల్తేర్‌ డివిజన్‌లో 66.88 మెట్రిక్‌ టన్నుల సరుకు లోడ్‌ చేసి 8498.86 కోట్లు ఆదాయం చేకూరిందని ఈస్ట్‌ కోస్ట్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అనుప్‌సత్పతి పేర్కొన్నారు. ఆదివారం ఈసందర్భంగా తెలియజేస్తూ వాల్తేర్‌ డివిజన్‌ లో 2023 మార్చి 25వ రోజు అత్యధిక లోడ్‌ అయిన 68.12 ఎం.టిని సాధించి ఆదాయాన్ని సాధించి సువర్ణాక్షరాలతో ముద్రించబడుతుందన్నారు.

ఆల్‌ టైమ్‌ పై రాబడి 9000 వేల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు, భద్రతా కారణాలు డబ్లింగ్‌, ట్రిపుల్‌లైన్‌ పనులు ఇనుప ఖనిజానికి తక్కువ డిమాండ్‌ డివిజన్‌లో భద్రతకు సంబందించిన పనులు వంటి అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ అన్ని శాఖల అత్యుత్తమ పనితీరు కారణంగా అరుదైన రికార్డు సాధ్యమైందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement