దేశంలో 651 మందుల ధరలు 6.73 శాతం తగ్గనున్నాయి. అత్యవసర మందుల జాబితాలో ఉన్న ఈ మందుల ధరలపై కేంద్ర పరభుత్వం సీలింగ్ ధరను నిర్ణయించింది. దీని వల్ల వీటి ధరలు తగ్గనున్నాయని ఔషధ ధరల నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ట్విటర్‌లో తెలిపింది. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం) జాబితాలో ఉన్న 870 మెడిసిన్స్‌లో ప్రభుత్వం ఇప్పటి వరకు 651 మందుల సీలింగ్ ధరను నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2002 సెప్టెంబర్‌లో ఎన్‌ఎల్‌ఈఎం జాబితాను సవరించిన తరువాత వీటి సంఖ్య 870గా ఉంది. ద్రవ్యోల్బణం కారణంగా వీటి ధరలు 12.12 శాతం పెరగాల్సి ఉంది. ప్రభుత్వం సీలింగ్ ధరలు నిర్ణయించడంతో వీటి ధరలు 6.73 శాతం తగ్గాయి.
సాధారణంగా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా మందుల ధరలు 12.12 శాతం పెరగాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వీటి ధరలు 6.73కి తగ్గాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్, యాంటీ డయాబెటిస్ ఔషధాలు మెట్‌ఫార్మిన్, గ్లిమెపిరైడ్, టెల్మిసార్టాన్, యాంటీ బయోటిక్ ఔషధం అమాెెక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ వంటి మందుల ధరలు తగ్గాయి. ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించే అత్యవసర మందులతో ఆరోగ్య శాఖ ఓ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 870 రకాల మందులు ఉన్నాయి. ఈ మందుల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) పర్యవేక్షిస్తోంది.
టోకు ధరల సూచీ ఆధారంగా ప్రతి సంవత్సరం ఔషధాల ధరలను నిర్ణయిస్తారు. ఇవి సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2022 సంవత్సరానికి ఈ సూచీ 12.12 శాతం పెరిగింది. దీంతో షెడ్యూల్డ్ ఔషధాల పరిధిలోకి వచ్చే 857 రకాల మందల ధరలను 12.12 శాతం పెం చుతూ ఎన్‌పీపీఏ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదించింది. ఇంత భారీగా ధరలు పెంచడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వీటిలో 651 మందుల ధరలపై సీలింగ్ విధించాలని కేంద్రం ఆదివారం నాడు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన సీలింగ్ ధరకు మించి ఈ మందులను విక్రయించేందుకు అనుమతి ఉండదు. ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు కొంత ఉపశమనం కలగనుంది.