Friday, November 22, 2024

నాలుగు సెషన్స్‌లో 6,417 కోట్లు వెనక్కి.. నెట్‌ సెల్లర్స్‌ గా విదేశీ ఇన్వెస్టర్లు..

విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ నుంచి భారీగా తమ పెట్టుబడులను ఉప సంహరించుకుంటున్నారు. భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌తో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లు పెంచిన తరువాత.. నాలుగు సెషన్స్‌లో సుమారు రూ.6,400 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీనికితోడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలు, ద్రవ్యోల్బణం, మానిటరీ పాలసీతో పాటు ఇతర అంతర్జాతీయ పరిణామాలు.. విదేశీ ఇన్వెస్టర్లను భయపెట్టిస్తున్నాయి. దీంతో భారీగా తమ పెట్టుబడులను ఉప సంహరించుకునేందుకు కారణం అవుతున్నాయి. 2022 ఏప్రిల్‌ వరకు గడిచిన ఏడు నెలలుగా ఫారెన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నెట్‌ సెల్లర్స్‌గానే ఉంటున్నారు. భారతీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి సుమారు రూ.1.65 లక్షల కోట్లను ఉప సంహరించుకున్నారు.

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుందనే అనుమానాలు తలెత్తినప్పటి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలపైనే దృష్టి సారిస్తున్నారు. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. ఎఫ్‌ఐఎస్‌లను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. 6 నెలల అమ్మకాల తరువాత.. మార్కెట్‌లో వచ్చిన కరెక్షన్‌ల కారణంగా ఏప్రిల్‌ మొదటి వారంలో.. ఎఫ్‌పీఐలు నికర పెట్టుబడిదారులుగా మారారు. ఈక్విటీల్లో రూ.7,707 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఏప్రిల్‌ 11-13 హాలిడే తరువాత.. మళ్లిd నెట్‌ సెల్లర్స్‌గా మారిపోయారు. కొన్ని వారాల నుంచి ఎఫ్‌పీఐలు నెట్‌ సెల్లర్స్‌గానే ఉంటున్నారు. మే మొత్తం మార్కెట్‌ ప్రతికూలంగానే ఉంది. మే నెలలో సుమారు రూ.6,417 కోట్ల అమ్మకాలు చేపట్టారు. మే 2 నుంచి 6వ తేదీ మధ్యలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. రంజాన్‌ కారణంగా మే 3న మార్కెట్‌కు సెలవు ఉండింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement