Friday, November 22, 2024

తెలంగాణ లో టెస్టులు తగ్గాయి… కరోనా కేసులు తగ్గాయి

కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిర్ధారణ టెస్ట్ ల స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రారంభమైన మొదట లో లక్షకుపైగా ప్రతిరోజు పరీక్షలను నిర్వహించేది. కానీ ఇప్పుడు తీవ్రత ఎక్కువవుతున్నకొద్దీ టెస్టుల సంఖ్యను క్రమేణా తగ్గిస్తూ వస్తున్నారు. చేస్తున్న పరీక్షలను బట్టే కేసులు కూడా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 77,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,361 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. అలాగే మరోవైపు రాష్ట్రంలో నిన్న ఒక్క రోజు కరోనాతో 51 మంది మరణించారు.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులు ఉండగా నిన్న ఒక్కరోజు 8,126 మంది కోలుకున్నారు. తాజాగా నమోదు అయిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువగా 1,225 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement