Friday, November 22, 2024

ఢిల్లిలో ఈవీల కోసం 633 కోట్ల రుణం.. క్యాబ్‌లు, ఆటోల కొనుగోలు

దేశ రాజధాని న్యూఢిల్లిdలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రోడ్లపై ఈవీ ఆటోలు, కార్గో వాహనాలు, క్యాబ్‌లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 5 వేల ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను, 1000 కార్గో ఈవీలను కొనుగోలు కోసం మహారత్న కంపెనీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ (పీఎఫ్‌సీ) 633 కోట్ల రూపాయల రుణానాన్ని జెన్సోల్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ (జీఈఎల్‌)కు మంజూరు చేసిందని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎఫ్‌సీ దేశంలో విద్యుత్‌ రంగంలో అగ్రగామి సంస్థగా ఉంది.

ఈ రుణంతో కొనుగోలు చేసిన ఈవీలను బ్లూస్మార్ట్‌ మొబిలిటీ ప్రైవెట్‌ లిమిటెడ్‌(బీఎంపీఎల్‌) లీజుకు ఇస్తారు. ఈ రుణంలో మొదటి విడతను విడుదల చేయడంతో ఈవీ క్యాబ్‌లను కొనుగోలు చేశారు. వీటిని విద్యుత్‌ మంత్రిత్వ శాక అదనపు కార్యదర్శి అజయ్‌ తివారీ, పీఎఫ్‌సీ సీఎండీ రవీందర్‌ సింగ్‌ థిల్లాన్‌తో కలిసి రోడ్లపైకి ప్రవేశపెట్టారు. ఈ వాహనాల మూలంగా సంవత్సరానికి లక్ష టన్నుల కార్బన్‌ వాయువుల విడుదల తగ్గుతుందని అంచనా వేశారు. 5 లక్షల పెద్ద చెట్లు పీల్చుకునే కార్బన్‌ వాయువులతో ఇది సమానం. పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుతో పాటు, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, బ్యాటరీ ఓఈఎంలకు కూడా రుణాలు ఇస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement