అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుచేస్తున్న పేదలందరికీ ఉచిత ఇళ్లు పధకాన్ని సాకరం చేసేందుకు గురువారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి భారీ కేటాయింపులే చేశారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి గృహ నిర్మాణానికి 6,291 కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోల్చితే ఈ కేటాయింపు కాస్త తక్కువగా ఉన్నాయి. అందకు కారణం గత ఏడాది గృహ నిర్మాణ శాఖకు సవరించిన అంచనాల బడ్జెట్‌ను భారీగా పెంచారు.
గత ఏడాది బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి 4,791 కోట్ల రూపాయలను కేటాయించగా ఆ తర్వాత ఆ బడ్జెట్ అంచనాలను 7,277 కోట్లకు పెంచారు. దీంతో గత ఏడాది బడ్జెట్ భారీగా పెరిగింది. 2021-2022లో గృహ నిర్మాణ శాఖకు కేవలం 2,980 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. వచ్చే ఏడాదికి కేటాయించిన బడ్జెట్‌లో పట్టణ గృహ నిర్మాణానికి 411 కోట్ల రూపాయలను కేటాయించారు.