Saturday, November 23, 2024

హుజురాబాద్ ఉపఎన్నికలో మొత్తం 61 మంది అభ్యర్థులు

హుజూరాబాద్ ఉప ఎన్నికకు శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసిన విష‌యం తెలిసిందే. దీంతో మొత్తం ఎన్ని నామినేష‌న్లు వ‌చ్చాయన్న విష‌యంపై అధికారులు వివ‌రాలు తెలిపారు. మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రకటించారు. నామినేషన్లు వేసిన వారిలో చాలా మంది అభ్య‌ర్థులు గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రులే ఉన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతోన్న ఫీల్డ్ అసిసెంట్లు పెద్ద ఎత్తున వ‌చ్చి నామినేష‌న్లు వేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. చివ‌ర‌కు ఈ ఉప ఎన్నిక బ‌రిలో 12 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిలిచారు. వారి త‌ర‌ఫున‌ జిల్లాల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లు అంతా వచ్చి ప్రచారం చేస్తారని ఆ సంఘం వెల్ల‌డించింది.

ప్ర‌ధాన పార్టీలు హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థి బల్మూరి వెంకట్ మ‌ధ్యే ప్ర‌ధానంగా పోటీ ఉండ‌నుంది. నామినేషన్‌ పత్రాలను సమర్పించిన నేప‌థ్యంలో తామే గెలుస్తామ‌ని ఆయా నేత‌లు ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement