బీహార్ రాష్ట్రంలోని రోహ్‌తాస్ జిల్లాలో ఒక ఇంట్లో దాదాపు 60 విషపూరితమైన పాములు బైటపడ్డాయి. జిల్లాలోని సూర్యపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రేద్ ఖుర్ద్ గ్రామంలో కృపానారాయణ్ పాండే అనే వ్యక్తి ఇంట్లో పాములు వెలుగులోకి వచ్చాయి. మొదటగా ఆ ఇంట్లో ఉంటున్నవారు భయంతో పారిపోయారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇతర గ్రామస్థులతో తిరిగివచ్చి పాముల్లో చాలా వాటిని చంపేశారు. గోడ పగలగొట్టి అందులో ఉన్న దాదాపు 30 పాములను కాపాడి వాటిని అటవీ ప్రాంతంలో వదిలివేసినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. 1955లో ఇల్లు కట్టినప్పటికీ అందులోనే ఉంటున్నామని, ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరగలేదని ఇంటి యజమాని కృపానారాయణ్ పాండే చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement