వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో జింబాబ్వే చేతిలో దారుణ పరాజయం పాలైన మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు మరో షాక్ తగలింది. జింబాబ్వేతో నిన్న (శనివారం) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతం కోత విధించారు. విండీస్ కెప్టెన్ షై హూప్ తమ పొరపాటును అంగీకరించాడు. దాంతో, మ్యాచ్ రిఫరీ మహమ్మద్ జావెద్ కరీబియన్ జట్టుకు జరిమానా విధించాల్సిందిగా ఐసీసీకి సూచించాడు.
నిర్ణీత సమయానికి విండీస్ జట్టు 3 ఓవర్లు వెనకబడింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేటు కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టీండీస్‌కు జింబాబ్వే షాకిచ్చింది. 35 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది.