Saturday, November 23, 2024

తెలంగాణలో 6వేల టీచర్ పోస్టులు ఖాళీ

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు. హేతుబద్ధీకరణ అనంతరం రాష్ట్రంలో 6 వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హేతుబద్ధీకరణ అనంతరం తక్కువ మంది విద్యార్థులు ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లయితే వారిని తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు పంపించనున్నారు. అయితే ఉపాధ్యాయులను బదిలీ చేశాక రాష్ట్రంలో కనీసం ఆరు వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ భావిస్తోంది.

ఈ మిగిలిన పోస్టులను డీఈవో దగ్గర ఉండనున్నాయి. భవిష్యత్‌లో ఒకవేళ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినట్లయితే అప్పుడు వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు హేతుబద్ధీకరణ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. 0 నుండి 19 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల కు కూడా ఒక టీచర్‌ను నియమించనున్నారు. ఇరవై నుండి అరవై మధ్య విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులని నియమిస్తారు.

ఈ వార్త కూడా చదవండి: ఒక్క రూపాయి దానం చేయాలని యాంకర్ రష్మీ అభ్యర్థన

Advertisement

తాజా వార్తలు

Advertisement