ప్రారంభ ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ వేలంలో మొత్తం 116 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. వీరిలో స్వదేశీ ప్లేయర్లతోపాటు విదేశీయులు ఉన్నారు. ఆరు ఫ్రాంచైజీలు- ఢిల్లి పంజర్స్, గార్విజ్ గుజరాత్, గోల్డెన్ ఈగల్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఐరన్‌మెన్, రాజస్థాన్, తెలుగు టాలోన్స్ వేలంలో పాల్గొన్నాయి. విదేశీ ఆటగాళ్ల కేటగిరీతో మంగళవారం వేలం ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రీడాకారులు, ఇతర సమాఖ్యల మధ్య ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ప్రాతినిధ్యం వహించింది. మొత్తం 18 మంది అంతర్జాతీయ ఆటగాళ్లను వివిధ జట్లు సొంతం చేసుకున్నాయి.
రైట్ బ్యాక్, లెఫ్ట్ బ్యాక్, గోల్‌కీపర్‌లుగా మాత్రమే విదేశీ ప్లేయర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆరుసార్లు రష్యన్ చాంపియన్ అయిన ఆండ్రీ ఇగోరెవిచ్ (గోల్‌కీపర్) ను తెలుగు టోలన్స్ కొనుగోలు చేసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన తులిబోవ్ ముఖ్తోర్ (రైట్‌బ్యాక్)ని గర్విట్ గుజరాత్ సొంతం చేసుకుంది. రష్యాకు చెందిన 20 ఏళ్ల అర్టెమ్ (రైట్‌బ్యాక్)ను ఢిల్లి పంజర్స్ కొనుగోలు చేయగా, ఇరాక్ లెఫ్ట్ బ్యాక్ ప్లేయర్ ఒదెరాలాదీన్ నాజర్‌ను రాజస్థాన్ దక్కించుకుంది. భారతస్టార్ ప్లేయర్లకు రిజర్వు చేయబడిన రెండవ కేటగిరీలో 42 మంది ఆటగాళ్లను వివిధ జట్లు సొంతం చేసుకున్నాయి. రోల్ ప్లేయర్స్‌గా పేర్కొనే ఆఖరి రౌండ్‌లో 56 మంది దేశీయ ప్లేయర్లలో 42 మంది వేలంలో వివిధ జట్లకు ఎంపికయ్యారు.