Saturday, November 23, 2024

ములుగు ఏజెన్సీలో 6 గంటలు.. సరిహద్దు ప్రాంతంలో పోలీస్​ కమిషనర్​ పర్యటన

వాజేడు (ప్రభ న్యూస్): ములుగు ఏజెన్సీలో రామగుండం సీపీ చంద్రశేఖర్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఓఎస్​డీ గౌ స్ఆలం ఆరు గంటల పాటు పర్యటించారు. తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడులో ఇవ్వాల (మంగళవారం) వారి పర్యటన కొనసాగింది. వాజేడు మండలంలోని టేకులగూడెం వద్ద గోదావరి వరదలకు జాతీయ రహదారి నీట మునిగింద. దీంతో అంతరాష్ట్ర రాకపోకలకు వారం రోజులుగా అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో నీట మునిగిన ప్రాంతాన్ని రామగుండం సీపీ చంద్రశేఖర్ పరిశీలించారు.

ఆ తర్వాత పోలీస్ అధికారులకు తగు సూచనలు, జాగ్రత్తలు సూచించారు. సరిహద్దు ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతాలను పూర్తిగా కలియతిరిగి, సరిహద్దు ప్రాంత పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల సమయంలో పోలీస్ యంత్రాంగం అలర్ట్ గా ఉండి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పర్యటనలో ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, సీఆర్​పీఎఫ్​ సీపీ వృషలి, వెంకటాపురం సీఐ శివప్రసాద్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement