ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తన ఐదవ జనరల్‌ను కోల్పోయింది. లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రీ మోర్డ్విచెవ్ వ్లాదిమిర్ పుతిన్ అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరు. సదరన్ మిలటరీ డిస్ట్రిక్ట్ 8వ ఆల్ మిలటరీ ఆర్మీకి నాయకుడిగా ఉన్నారు. ఇంతకు ముందు మరణించిన జనరల్స్ మాదిరిగానే, మోర్డ్విచెవ్ మరణవార్తనూ తొలుత మాస్కో ధ్రువీకరించలేదు. కానీ కీవ్‌లోని రష్యన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ నుంచి మాత్రం ప్రకటన వెలువడింది.
అతను ఎక్కడ చంపబడ్డాడో స్పష్టత ఇవ్వలేదు. తాజా ఘటనతో రష్యా జనరల్ హోదా అధికారులను ఐదుగురిని ఉక్రెయిన్ మట్టుబెట్టినట్లయింది. ఇక గాయపడిన రష్యన్ సైనికులు బెలారస్‌లోని గోమల్ ఆస్పత్రిలో నిండిపోయారని ఉక్రెయిన్ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..