ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ ఈ నెలలోనే 5జీ సర్వీస్‌లను ప్రారంభిస్తామని ప్రకటించింది. దీని కోసం టెలికం గేర్ల తయారీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకన్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందించేందుకు ఎయిర్టెల్ చాలా కాలంగా ఎరిక్సన్, నోకియాతో ఒప్పందం కొనసాగిస్తోంది. తాజాగా శాంసంగ్‌తోనూ ఒప్పందం చేసుకుంది.
5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఎయిర్టెల్ 43,084 కోతో 19,867.8 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఆగస్టులోనే కస్టమర్లకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ సీఈవో గోపాల్ ప్రకటించారు. 5జీ కనెక్టివిటిని వినియోగదారులకు అందించేందుకు ప్రపంచంలోనే పేరుగాంచిన టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. స్పెక్ట్రమ్ పొందిన కంపెనీలకు ఈ నెల 10 లోగానే అందిస్తామని కేంద్రం టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంతో ఈ దిశగా ఎయిర్టెల్ వేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.