ఆరు రోజులుగా సాగుతున్న 5జీ వేలం ఆదివారం నాటికి మొత్తం బిడ్ల విలువ 1.5 లక్షల కోట్లు దాటింది. ఆదివారం నాడు 163 కోట్లకు బిడ్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంత సర్కిల్ కోసం టెలికం కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు 5జీ వేలంలో కంపెనీలు 1,50,130 కోట్ల మేర బిడ్లు దాఖలు చేశాయి. రేపు (సోమవారం) కూడా వేలం కొనసాగనుంది. ఆరో రోజైన ఆదివారం నాడు మొత్తం ఏడు రౌండ్లు వేలం జరిగింది. ఉత్తర ప్రదేశ్ తూర్పు సర్కిల్‌లో లక్నో, అలహాబాద్, వారణాసి, గోరక్‌పూర్, కాన్పూర్ వంటి ప్రధానమైన పట్టణాలు, నగరాలు ఉన్నాయి.
దీంతో ఈ సర్కిల్ కోసం టెలికం కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సర్కిల్‌లో అత్యధికంగా 10 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో రియలన్స్ జియోకు 3.29 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌కు 3.7 కోట్లు, వోడాఫోన్ ఐడియాకు 2.02 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. రేపు (సోమవారం) 38 రౌండ్‌తో వేలం కొనసాగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.