భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5,676 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 37,093 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీ- 2,338, తమిళనాడు- 2,099, గుజరాత్- 1,932, హరియాణా – 1,928, కర్ణాటక – 1,673, ఉత్తర్ ప్రదేశ్‌లో 1,282 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,000కి చేరింది.