Wednesday, November 20, 2024

మ‌ణిపూర్ హింసాకాండ‌లో 54 మంది మృతి….సైన్యం గుప్పెట్లో రాష్ట్రం

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. మణిపూర్ మారణహోమంలో మరణించిన వారి సంఖ్య 54కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో బుల్లెట్‌ గాయాలు తగిలిన మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సాధారణ పరిస్థితిని నెలకొల్పడం కోసం కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దింపింది. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీ దళాలు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, కేంద్ర పోలీసులు బలగాలలు అన్ని సమస్యాత్మక ప్రాంతాలు, రహదారుల్లో పహరా కాస్తున్నాయి. ఆర్టికల్‌ 355ను సైతం కేంద్ర అమల్లోకి తీసుకొచ్చింది.


ఇది ఇలా ఉంటే శనివారం ఉదయం షాపులు, మార్కెట్లు తిరిగి తెరుచుకోవడంతో శనివారం ఇంఫాల్‌ వ్యాలీలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు కురగాయాలు వంటి నిత్యవసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. కార్లు వంటి వాహనాలు సైతం రోడ్డెక్కాయి. గడిచిన 12 గంటల్లో, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయిని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే వేంగంగా స్పందించిన ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు పరిస్థితిని నియత్రణలోకి తీసుకొచ్చాయని తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. వారికి సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement