Friday, November 22, 2024

ఉక్రెయిన్‌ దాడిలో 5300 రష్యన్‌ ఆర్మీ హతం, నేలకూలిన 29 యుద్ధ విమానలు.. 191 యుద్ధ ట్యాంకర్లు ధ్వంసం

రష్యా దాడులను ఉక్రెయిన్‌ సైన్యం సవాల్‌గా తీసుకుంటున్నది. ఈ మేరకు సోమవారంతో సైనిక చర్య ఐదో రోజుకు చేరుకుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించింది. నలువైపుల నుంచి ఉక్రెయిన్‌ను రష్యా సైన్యం ఊపిరి ఆడకుండా చేస్తున్నది. అయితే ఉక్రెయిన్‌ సైన్యం కూడా గట్టిగా బదులు ఇస్తున్నది. తమ కంటే రష్యాకే భారీ ఆస్తి, నష్టం సంభవించినట్టు ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాము చేసిన నాలుగు రోజుల దాడుల్లో 5,300 మంది రష్యన్‌ సైనికులు హతమైనట్టు వివరించింది. అదేవిధంగా రష్యాకు చెందిన 29 లిటాకీ, 29 హెలికాప్టర్లు, 191 యుద్ధ ట్యాంకులు, 816 యుద్ధ సాయుధ వాహనాలను ధంసం చేసినట్టు వెల్లడించింది. 74 గార్మాట్‌లు, 21 గ్రాడ్‌లు, 291 ఆటోమోటివ్‌లు, 60 ట్యాంకర్స్‌, 3 యూఏవీ ఓటీఆర్‌లు, 2 షిప్‌/బోట్స్‌తో పాటు 5 జసోబి ఓపీపీలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిపింది. యుద్ధ ప్రారంభ దశలో రష్యా భారీ ప్రాణ నష్టాన్ని మూటగట్టుకుందని బ్రిటన్‌ రక్షణ మంత్రిత శాఖ కూడా విశ్వసిస్తోంది. తమ దేశం నుంచి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందన్న ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ.. ఎంత అనేది స్పష్టంగా తెలియలేదని ప్రకటించింది.

రష్యన్‌ ఆర్మీకి సవాల్‌..

యుద్ధం ప్రారంభ దశలో కనీసం 94 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి పరిశీలకులు (అబ్జర్వర్స్‌) తెలిపారు. ఈ దాడితో భారీ ప్రాణ నష్టం జరిగిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. ఉక్రెయిన్‌తో పోలిస్తే.. రష్యాకే తీవ్ర నష్టం జరిగిందని ఉక్రెయిన్‌ సాయుధ బలగాల జనరల్‌ స్టాఫ్‌ తెలిపింది. రష్యా బలగాలు నైతిక ధైర్యాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమ దేశంపై రష్యా దాడులు తీవ్రత తగ్గిందన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణదారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ బిగ్రేడ్స్‌.. తమ శత్రువు యుద్ధ వాహనాలను, సైనికులకు దెబ్బతీశాయని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో వాస్తవ పరిస్థితులను చూసి రష్యా భయపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై సైనిక దాడుల్లో.. రష్యా బలగాలు ఆగ్నేయ ప్రాంతంలోని జపోరిజ్జియా అణు విద్యుత్‌ ప్లాంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement