Saturday, November 16, 2024

అప్పుల ఊబీలో 52 దేశాలు.. ఐక్యరాజ్య సమితి హెచ్చరిక

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం 52 దేశాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) అధిపతి అచిమ్‌ స్టెయినర్‌ వెల్లడించారు. రుణ చెల్లింపు సమస్యలను ఎదుర్కొంటున్న ఈ దేశాలకు సాయం చేసేందుకు అత్యవసర చర్యలు అవసరమని ఆయన చెప్పారు. మొత్తం 52 దేశాల్లోని 25 దేశాలు ప్రభుత్వ ఆదాయంలో అయితో వంతు కంటే ఎక్కువ కేవలం రుణాల నిర్వహణకే ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. 46 అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల (ఎల్‌డీసీ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా స్టెయినర్‌ ఈ విషయాన్ని తెలిపారు.

జాతీయ రుణాల విషయంలో ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. యూఎన్‌డీపీ అంచనా ప్రకారం 52 దేశాలు అప్పుల ఉబిలో చిక్కుకున్నాయి. వాటిలో కొన్ని దివాలా తీసేందుకు ఒక అడుగు దూరంలోనే ఉన్నాయి. ఈ దేశాల విదేశీ రుణాల విలువ అంతర్జాతీయ విదేశీ రుణంలో కేవలం మూడు శాతం మాత్రమే. కాని ఈ దేశాలు ప్రపంచ జనాభాలో ఆరోవంతు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, ఆర్ధిక మార్కెట్లు ఈ దేశాలపై తగినంత శ్రద్ద చూపడంలేదు. అని స్టెయినర్‌ చెప్పారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన 52 దేశాల్లో బంగ్లాదేశ్‌, అఎ్ఘానిస్తాన్‌, అర్జెంటినా, ఉక్రెయిన్‌తో పాటు సబ్‌ సహారా ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రాంతాల్లోని దేశాలు ఉన్నాయి.

- Advertisement -

రుణాల పునర్‌వ్యవస్థీకరణ ఆర్ధిక సాయం చేసేందుకు అత్యవసర మార్గాలను అన్వేషించాలని ఇప్పటికే స్పష్టంగా పిలుపు ఇచ్చామని, లేని పక్షంలో ఒక దేశం తరువాత మరో దేశం అప్పుల్లో చిక్కుకుపోతాయని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్‌ యుద్దంతో ఆహార, ఇంధన ధరలపై ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ఇంధన వ్యయాలు, అప్పుల్లో కూరుపోయిన దేశాలకు షాక్‌గా మారాయన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావం వడ్డీ రేట్లను పెంచుతోంది. అని తెలిపారు. కరోనా పరిస్థితులు, పెరుగుతున్న ఆహార, ఇంధన వ్యయాలు, ఆర్ధిక సంక్షోభాల కారణంగా పేద దేశాల రుణాలు గత దశాబద కాలంలో రెట్టింపు అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement