Saturday, November 23, 2024

అమ్నెస్టీ ఇండియాకు 51.72 కోట్ల జరిమానా.. సంస్థ మాజీ సీఈఓకూ 10 కోట్ల పెనాల్టి

విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై అమ్నెస్టీ ఇండియాపై రూ.51.72 కోట్ల మేర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ జరిమానా విధించింది. ఆ సంస్థ మాజీ సీఈఓకూ రూ. 10 కోట్ల పెనాల్టిd విధించింది. విదేశీ మారకద్రవ్య చట్టం ఉల్లంఘనలపై షోకాజ్‌ నోటీసు కూడా జారీచేసింది. తమ కేంద్ర సంస్థ అయిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ (యూకే)నుంచి పెద్దఎత్తున నిధులు వస్తుండగా అప్పులు, వడ్డీల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. 2013-18 మధ్య కాలంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రధాన కార్యాలయం నుంచి పెద్దఎత్తున నిధులు వచ్చాయి.

బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ, పబ్లిక్‌ రిలేషన్‌ సర్వీసెస్‌ పేరుతో విదేశాలనుంచి నిధులు స్వీకరించారని, నిజానికి ఆ మొత్తాన్ని రుణంగానే పరిగణించాల్సి ఉంటుందని, ఇది ఫెమా నిబంధనలకు విరుద్ధమని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ సంస్థ చెప్పిన కార్యకలాపాలకు, నిర్వహిస్తున్న పనులకు సంబంధం లేదని ఈడీ చెబుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement