గాజా స్ట్రిప్‌లోని అల్-అహీ బాప్టిస్ట్ హాస్పిటల్ భవనంపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆసుపత్రి భవనంలో భారీ సంఖ్యలో ఆశ్రయం పొందుతున్న పౌరులున్నారు. తాజా దాడితో భవనం మంటల్లో చిక్కుకుంది. పరిసర ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. మృతుల్లో చాలా వరకు చిన్నపిల్లలు ఉన్నారు. వారి చుట్టూ ఉన్న గడ్డి దుప్పట్లు, పాఠశాల బ్యాక్‌ప్యాక్‌లు, ఇతర వస్తువులతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా ఉంది.
క్షతగాత్రులను రక్తసిక్తమైన నేలపై పడుకోబెట్టారు. వారు నొప్పితో కేకలు వేశారు అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. జెనీవా ఒప్పందాల ప్రకారం ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరం. #హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు 1,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గాజాలో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ అక్కడ 3000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడారు.
అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత గాయపడిన వేలాది మంది పౌరులతో ఆస్పత్రి కిక్కిరిసింది. దాడి తర్వాత, ఆసుపత్రి డైరెక్టర్ మ#హ్మద్ అబు సెల్మియా మాట్లాడుతూ, మాకు పరికరాలు కావాలి. మందులు కావాలి. పడకలు కావాలి. అనస్థీషియా కావాలి.. అత్యవసర సేవలకు ఇంకా ఇంకా కావాలి అని చెప్పారు. ఉత్తర గాజాలో 2000 మందికి పైగా ఇన్‌పేషెంట్లకు చికిత్స చేస్తున్న 22 ఆసుపత్రుల తరలింపు కోసం ఇజ్రాయెల్ పదేపదే ఆదేశాలను జారీచేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది. రోగులు, ఆరోగ్య కార్యకర్తలను బలవంతంగా తరలించడం ప్రస్తుత మానవతా, ప్రజారోగ్య విపత్తును మరింత దిగజార్చుతుందని పేర్కొంది. తక్షణమే ఇజ్రాయెల్ తన తరలింపు ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరింది.
ఆసుపత్రిపై దాడి ఉగ్రచర్యే: ఇజ్రాయెల్
ఆసుపత్రిపై దాడి ఘటనపై రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యమే వైమానికి దాడికి పాల్పడిందంటూ హమాస్ ఆరోపిస్తుండగా, హమాస్ మిలిటెంట్లు పేల్చిన రాకెట్ మిస్ ఫైర్ అయి ఆసుపత్రిపై పడటంతో ఈ దారుణం చోటు చేసుకుందంటూ ఇజ్రాయెల్ విమర్శిస్తోంది. హమాస్ ఆరోపణల్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యా#హు ఖండించారు.ఈ విషయాన్ని యావత్ ప్రపంచం తెలుసుకోవాలి. గాజాలోని అనాగరిక ఉగ్ర మూకలే అక్కడి ఆసుపత్రిపై దాడి చేశాయి. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్)కు దాడితో సంబంధం లేదు. మా పిల్లలను అతి దారుణంగా #హత్య చేసిన ఆ ఉగ్రవాదులు, ఇప్పుడు వారి పిల్లలను కూడా చంపేస్తున్నారు అని నెతన్యా#హు ఆరోపించారు. అటు ‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రి సమీపంలో పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పి ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఐడీఎఫ్ అధికారిక ఎక్స్ (ట్విటర్)ఖాతాలో ఓ వీడియో, కొన్ని పోస్టులు చేసింది.
పౌరుల మరణాలు ఆందోళనకరం: మోడీ దిగ్భ్రాంతి
గాజా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ”గాజాలోని అల్ అ#్లహ ఆసుపత్రిలో పెను ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుత ఘర్షణల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన, ఆందోళనకర అంశం. ఇందుకు కారకులకు శిక్ష పడాలి” అని మోడీ పేర్కొన్నారు.
బాంబు షెల్టర్‌లో తలదాచుకున్న జర్మనీ ఛాన్సలర్..
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూను కలిసేందుకు వెళ్లిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. టెల్ అవివ్‌పై రాకెట్ల దాడి జరిగిన సమయంలో బాంబు షెల్టర్‌లో ఓలాఫ్ స్కల్జ్ దాక్కున్నారు. గాజా నుంచి వస్తున్న రాకెట్ల దాడి నుంచి తప్పించుకునేందుకు జర్మనీ ఛాన్సలర్‌కు చెందిన బృందాన్ని కూడా విమానం నుంచి దించేశారు. టెల్ అవివ్‌లో ఉన్న బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ రైడ్ అలారమ్ మోగించారు. జర్మనీ రిపోర్టర్ సారా సివరేట్ తన ఫోన్‌తో కొంత ఫూటేజ్ తీశారు. ఎయిర్‌పోర్టు లో విమానం నుంచి జర్నలిస్టులను దించేసి టర్మాక్‌పై తలదాచుకున్న వీడియోను విడుదల చేశారు. రాకెట్ల దాడి సమయంలో జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్‌ను నేలపై పడుకోబెట్టారని కొన్ని రిపోర్టులు వచ్చాయి. అయితే సమీపంలో ఉన్న షెల్టర్‌కు ఆయన్ను తీసుకువెళ్లారని జర్నలిస్టు రాబిన్ అలెగ్జాండర్ తెలిపారు. విమానం నుంచి అందర్నీ ఖాళీ చేయించిన తర్వాత మళ్లి కొంత సమయానికి జర్మనీ ఛాన్సలర్‌ను ఆ విమానం ఎక్కించారు. నాటకీయ పరిణామాల మధ్య జర్మనీ బృందం కైరోకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ పర్యటనకు రిషి సునాక్..!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఆయన ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నట్లు స్కై న్యూస్ కథనం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధవీకరించలేదు. కాగా, గత వారం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించేందుకు బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ ఆ దేశంలో పర్యటించిన విషయం తెలిసిందే.