అస్సోంలో వరద పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నది. ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేద. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమునాముఖ్ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్ గ్రామాలు నీట మునగడంతో దాదాపు 500 కుటుంబాలు రైల్వే ట్రాక్‌లో బతకులు వెళ్లదీస్తున్నారు. ఈ రెండు గ్రామాలు లోతట్టున ఉండడంతో పూర్తిగా నీటిమునిగాయి. గ్రామస్థులు సర్వం కోల్పోయారు. రైల్వే ట్రాక్ కొంచెం ఎత్తులో ఉండడంతో రెండు గ్రామాల కుటుంబాలు ఇక్కడికి చేరుకున్నాయి. సొంత డబ్బులతో టార్పాలిన్ కవర్‌లు కొనుక్కొని గుడారాలు వేసుకున్నట్లు బాధితులు తెలియజేశారు.
అధికారులు కానీ, నాయకులు కానీ ఎవరూ తమ ముఖాన్ని ఇంతవరకు చూడలేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని కూడా తెలియజేశారు. పాటియా పాథర్ గ్రామానికి చెందిన మోన్‌వారా బేగం (43) తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడారాలలోనే ఉంటున్నది. వారితో పాటు మరో నాలుగు కుటుంబాల సభ్యులు కూడా ఈ చిన్న గుడారంలోనే తలదాచుకుంటున్నారు. నిజానికి అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..