Tuesday, November 26, 2024

భాషా పరిరక్షణకు 50 కోట్లు.. ఎంపీ లావు ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అంతరించిపోతున్న భాషల రక్షణ కోసం 2015-16, 2021-22 మధ్య కాలంలో రూ.48.9 కోట్లను విడుదల చేసినట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. భారతదేశం నలుమూలల నుంచి 117 అంతరించిపోతున్న భాషలను అధ్యయనం కోసం ఎంచుకున్నట్టు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. దేశంలో అంతరించిపోతున్న భాషలు, వాటిని సంరక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సోమవారం ఆయన లిఖితపూర్వకంగా బదులిచ్చారు.

మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ పది వేల కంటే తక్కువ మంది మాట్లాడే భారతదేశంలోని అన్ని భాషలను సంరక్షిస్తుందని, డాక్యుమెంట్ల రూపంలో పొందు పరుస్తుందని చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్‌డేంజర్డ్ (ఎస్పీపీఈఎల్ ) పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మైసూరులోని సీఐఐఎల్ ద్వారా తోటి, గోరు భాషలను ఎస్పీపీఈఎల్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు సుభాష్ సర్కార్ వివరించారు. ఎస్పీపీఈఎల్ అందించిన మెటీరియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, భారతదేశంలో అంతరించిపోతున్న భాషల సంఖ్యపై కేంద్రీకృత డేటా లేదని ఆయన జవాబులో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement