హైదరాబాద్, ఆంధ్రప్రభ: వ్యవసాయ చరిత్ర మానవచరిత్రలో అతిపెద్దఆంశం. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అత్యంత ప్రబలమైన రంగంగా దేశంలో నిలిచింది. విస్తరించని భూమిపై విస్తరిస్తున్న మానవాళి అవసరాలకు వ్యవసాయం అత్యంత కీలకరంగా భావించడంతో ఆనాదినుంచి నేటివరకు ఈ రంగాభివృద్ధికి ప్రయత్నాలు జరిగితూనే ఉన్నాయి. జలవనరులు పుష్కలంగా ఉంటేనే కాంతులీనే పంటలు కళ్లముందు కదలాడుతాయని శాతవాహనుల నుంచి ఆసఫ్ జాహీల వరకు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికి ఉమ్మడిపాలనలో వ్యవసాయం దండగై రైతులు ఉసురుతీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ సాగు,తాగునీటి రంగానికి అధికప్రాధాన్యత ఇచ్చి కృష్ణా, గోదావరి నదీపరివాహక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టుల పునరుద్ధరించడంతో తెలంగాణలో వ్యవసాయం పండుగైంది. వందలాది సంవత్సరాలక్రితం నిర్మించిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చి జలవనరుల పరిరక్షణ నిరంతరం ప్రక్రియగా తీర్చి దిద్దారు. ఈ నేపథ్యంలో నిజాంరాజులు 1905లో నిర్మించిన మహబూబ్ నహర్, ఫతే నహర్ కాలువలను కలిపి వనదుర్గ ప్రాజెక్టుగా మార్చి అభివృద్దికి శ్రీకారం చుట్టారు.
బతుకుపోరులో ఉపాధి కోసం అలసి వలసజీవులుగా బతుకునీడ్చే మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో నీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యతతో ఆప్రాంతాల్లో ని పంటపొలాలు పసిడిపంటల కాంతులీనుతున్నాయి. మెదక్ జిల్లాలోని కొల్చారం, పాపన్నపేటమండాల మధ్య మంజీరా నదిపై 1905లో 0.135 సామర్థ్యంతో నిర్మించిన మహబూబ్ నహర్, ఫతే నహర్ కాలువలు వనదుర్గ పేరుపెట్టి కాలువ పూడిక తీత, ఆనకట్టల ఎత్తు పెంచడం, కాలవలనుంచి వ్యవసాయ క్షేత్రాలకు సాగునీటి కాువల నిర్మాణాల పనులు చేపట్టారు. 43.68 కిలోమీటర్ల పరిధిలో కాలువలను పునరుద్ధరించే పనులు వేగంగా జరగుతున్నాయి. ఈ వనదుర్గ ప్రాజెక్టు ద్వారా 2165 ఎకరాల ఆయకట్టును స్థిరీకరంచే లక్ష్యంతో రెండు పంటలకు నీరందించేందుకు పనుల్లో వేగం పెంచారు.
నీటి నిల్వసామర్థం పెంపుతో పాటు వనదుర్గ కాలువల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఆర్ టి నం. 37 ద్వారా నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ.43.64 కోట్లతో 2016 నుంచి పనులు జరుగుతుండగా మరో రూ. 50 కోట్లు మంజూరుచేసి పంటపొలాలకు కాలువలు, పూడిక, ప్రాజెక్టుఎత్తుపెంచేందుకు మెసర్స్ రాఘవ కన్ స్ట్రక్షన్ కు ప్రభుత్వం పనులు అప్పగించి 2023 మార్చి 31 నాటికి పనులు పూర్తి చేస్తే వర్షకాలంలో నీటి నిల్వ పెంచుకునే అవకాశం ఉందని తెలిపింది. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో నీటికోసం మొగులు దిక్కు చూసే రోజులు అంతరించాయి. వరుణ దేవుడు కనికరించాలని ఆడే కప్పతల్లి ఆటలు కనుమరుగయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ క్షేత్రంగా రూపాంతరం చెందుతుంది. ప్రధానంగా మెతుకుసీమ గా చరిత్రలో సుప్రసిద్ధమైన మెదక్ తిరిగి ఆపేరును సార్థకం చేసుకునేందుకు సిద్ధంగా రూపాంతరం చెందింది.
గతంలో యాసంగి వచ్చిందంటే భూములు బీడుపెట్టి రైతులంతా కూలీలుగా మారేవారు. ఇది గత తొమ్మిదేళ్ల క్రితం మాట జీధార కాళేశ్వరంతో పుష్కలమైన సాగునీరుతో పసిడి పంటలు పండుతున్నాయి. చెరువులు,కుంటలు, జలాశయాలు, నీటివనరుల్లో పుష్కలమైన నీటినిల్వలుండటంతో లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రిజర్వాయర్లు, ప ంటకాలువలకు తోడుగా జలాశయాలసామర్థ్యంపెంపుతో తెలంగాణ రాష్ట్రం సాగునీటి క్షేత్రంగా అలరాలుతుండగా మొగులు పై వానకోసం ఎదురుచూసే రోజులు అంతరించాయి.