హైదరాబాద్ : నాంపల్లి అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు మంత్రి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఆ తర్వాత దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. దీపావళి తర్వాత ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్లో లేక ఫైర్ క్రేకర్ వల్లో అగ్గి రవ్వలు రేగి, అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని కేటీఆర్ అన్నారు.
రసాయనాలను భవన సెల్లార్ లో నిల్వ ఉంచడం వల్ల ఈ ప్రమాద ఘటన జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానన్న కేటీఆర్.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున ప్రకటించారు. గాయపడిన వారికి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్న ఆయన.. అవసరమైతే మెరుగైన వైద్యం అందించాల్సి వస్తే, ప్రైవేట్ ఆస్పత్రికి కూడా తరలిస్తామని అన్నారు. ఆస్తి నష్టపోయిన వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదాలపై 6 నెలల కిందట సేఫ్టీ ఆడిట్ కింద ఎక్వైరీ చేయించామన్నారు.