Saturday, November 23, 2024

Delhi | తెలంగాణ డిజిటల్ మీడియా విభాగానికి 5 కేంద్ర అవార్డులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఐదు కేంద్రప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. న్యూఢిల్లీలో గురు, శుక్రవారాల్లో జిరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్‌లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం “సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును పీఆర్సీఐ అందిస్తుంది.

ఈ అవార్డుతో పాటు, డిజిటల్ మీడియా విభాగం 2023 సంవత్సరానికి గాను మరో నాలుగు పీఆర్సీఐ ఎక్సలెన్స్ అవార్డులను గెలుచుకుంది. సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు, ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23 ), ప్రజా సేవల ప్రకటనల అవార్డు (“మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం” వీడియోకి), ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ (“కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం” వీడియోకి) పురస్కారాలు దక్కాయి.

తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున సహాయ సంచాలకులు, డిజిటల్ మీడియా ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు. ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం 2014 జూన్‌లో ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, సేవలను డిజిటల్ మాధ్యమాలలో పౌరులకు చేరవేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యత.

సామాజిక మధ్యమాల ఖాతాల నిర్వహణ; వెబ్‌సైట్‌లు/పోర్టల్‌ల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ, ఓపెన్ గవర్నమెంట్ డేటా, కంటెంట్, ఫ్యాక్ట్ చెక్, తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ కార్యక్రమాల అమలు డిజిటల్ మీడియా విభాగం ఇతర ప్రధాన విధులు. అంతేకాక సంస్థల నిపుణులతో ప్రభుత్వాధికారులు, సిబ్బందికి సామాజిక మధ్యమాలపై శిక్షణా కార్యక్రమాలను ఈ టల్ మీడియా విభాగం నిర్వహిస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement