Tuesday, November 19, 2024

అసోంలో భారీ భూకంపం

అసోం, మేఘాలయాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో గోల్‌పారాలో రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. మేఘాలయలోని తురాకు ఉత్తరాన 71 కిలోమీటర్ల దూరం, భూమికి 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భారీగా ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. అయితే నష్టానికి సంబంధించిన నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement