ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవ్వాల (మంగళవారం) 4వ చార్జిషీట్ దాఖలు చేసింది. పలు అభియోగాలతో కూడిన పత్రాలను రౌస్ అవెన్యూ కోర్టుకు అందజేసింది. ఇందులో బాగంగా కోర్టు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు మరోసారి నోటీసులు జారీచేసింది. ఇక.. ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ గత చార్జిషీట్లలో మోపిన అభియోగాలనే ఈడీ మరోమారు ప్రస్తావించింది.. కాగా, లేటెస్ట్గా ఇచ్చిన చార్జిషీట్లోనూ కవితపై రొటీన్ అభియోగాలనే దర్యాప్తు సంస్థ ప్రస్తావనకు తీసుకొచ్చింది. ఇక.. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను పలుమార్లు ప్రశ్నించగా… ఇట్లా ఈ కేసులో ప్రశ్నించిన 51 మంది వివరాలను, వారి సమాధానాలను మరోమారు అభియోగ పత్రంలో ఈడీ పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement